సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'హరిహర వీరమల్లు'... ఈ నెల 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్

Pawan Kalyans Hari Hara Veera Mallu Pre Release Event in Vizag
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం జులై 20న విశాఖపట్నంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. 

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కొంత భాగం దర్శకత్వం వహించగా, మిగతా పార్ట్ ను ఏఎం జ్యోతికృష్ణ పూర్తిచేశారు. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలతో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. 

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక పవర్ ఫుల్ సాంగ్ తో పాటు చిత్ర నిర్మాణ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం, కన్నులపండుగలా ఉంటుందని అంచనా. మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండటంతో అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Krish Jagarlamudi
AM Ratnam
Nidhi Agarwal
Bobby Deol
MM Keeravani
Telugu Movie
Pre Release Event
Vizag

More Telugu News