మెడ్‌టెక్ జోన్‌కు ప్రత్యేక గుర్తింపు
- ఏపీలో తొలి నోటిఫైడ్ ఆడిటింగ్ సంస్థగా మెడ్‌టెక్ జోన్
- ఉత్తర్వులు జారీ చేసిన సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్
ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తయారయ్యే వైద్య పరికరాలకు ఈ ధ్రువీకరణ వర్తించనుంది. ఈ సందర్భంగా మెడ్‌టెక్ జోన్ యాజమాన్యం, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జారీ చేసిన ఉత్తర్వులను, సంబంధిత ఫోటోను మెడ్‌టెక్ జోన్ సంస్థ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకుంది.