ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి తెలంగాణ సర్కారు భరోసా
- రాష్ట్రంలో బాల భరోసా పేరుతో సరికొత్త సంక్షేమ పథకం
- అన్నిరకాల వైద్య పరీక్షలు చేయిస్తామన్న మంత్రి సీతక్క
- అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా..
ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో నిన్న కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క ఈ వివరాలు వెల్లడించారు. బాల భరోసా పథకం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులకు ఎంతో మేలు కలగనుంది. చిన్నారుల అనారోగ్యం, ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులతో అప్పులపాలవుతున్న తల్లిదండ్రులకు ఈ పథకం భారీ ఊరట కల్పించనుంది. కాగా, ఈ పథకంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.