Donald Trump: ఆ డేటింగ్ యాప్స్ జోలికెళ్లొద్దు... అమెరికన్ పౌరులకు ట్రంప్ ప్రభుత్వం అడ్వైజరీ
- డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన ట్రంప్ సర్కార్
- అప్రమత్తంగా ఉండేందుకు పలు సూచనలు చేసిన అమెరికన్ కాన్సులేట్
- పరిచయమైన వ్యక్తిపై అనుమానం ఉంటే అత్యవసర హెల్ప్ లైన్ 911కి కాల్ చేయాలని సూచన
డేటింగ్ యాప్స్ వినియోగించే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ఈ యాప్స్ గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పేరుతో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తులే ప్రాణహాని తలపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
మెక్సికోలో జరిగిన కిడ్నాప్ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా కాన్సుల్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల మెక్సికోలోని ప్యుర్టో వలార్టా, నుయేవో నయరిట్ ప్రాంతాల్లో పలువురు అమెరికన్ పౌరులు కిడ్నాప్‌కు గురయ్యారు. వారిని డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులే కిడ్నాప్ చేసి, విడిపించేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది.
ఈ కిడ్నాప్‌లు ఒక ప్రాంతానికే పరిమితం కాదని, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఈ కిడ్నాప్‌లు పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరించారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, దాదాపు ప్రతి పది మంది అమెరికన్లలో ముగ్గురు డేటింగ్ యాప్‌లు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇవి అక్కడి ప్రజల్లో పరిచయాల కోసం విస్తృతంగా ఉపయోగించే మార్గంగా తయారయ్యాయి. వీటి ద్వారా ఇప్పుడు స్కాములు, కిడ్నాప్‌లు వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్ డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేసింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులను కలవాలంటే తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాలని సూచించింది.
**అవి ఏమిటంటే..**
* డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వారిని మొదటిసారి కలుస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లోనే కలవాలి.
* ఒంటరిగా ఉండే ప్రాంతాలు, హోటల్ గదులు, వ్యక్తిగత నివాసాల వంటి ప్రదేశాలకు వెళ్లవద్దు.
* ఎవరిని కలుస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయాలి.
* సదరు వ్యక్తుల వివరాలు, యాప్ పేరు కూడా సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.
* పరిచయమైన వ్యక్తి విషయంలో ఏదైనా అనుమానం ఉంటే వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ 911కు కాల్ చేయాలి.
* అమెరికన్ పౌరులు దగ్గరలోని కాన్సులేట్‌ను కూడా సంప్రదించవచ్చు.