పవన్ కల్యాణ్, లోకేశ్ లకు జవాన్ రిక్వెస్ట్.. వీడియో ఇదిగో!
- సార్ మీరే న్యాయం చేయాలంటూ వేడుకోలు
- తన భూమిని కబ్జా చేశారంటూ ఆవేదన
- కోర్టు తీర్పు ఇచ్చినా ఖాళీ చేయడంలేదని ఆరోపణ
శ్రీ సత్యసాయి జిల్లా హుదుగూరుకు చెందిన జవాన్ నరసింహమూర్తి ఈమేరకు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లకు సెల్ఫీ వీడియో పంపారు. జమ్మూ నుండి వీడియో విడుదల చేసిన జవాన్.. ఆ భూమి తనదేనని కోర్టు కూడా తీర్పిచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పును అమలుచేయాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జవాన్ నరసింహమూర్తి ఆరోపించారు.