భారత్ లో హ్యుందాయ్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా?
- హ్యుందాయ్ మోటార్ ఇండియాకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా పంకజ్ త్రిపాఠి
- నమ్మకం, వాస్తవికతకు త్రిపాఠి ప్రతిరూపమని కంపెనీ వెల్లడి
- వినియోగదారులతో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యం
- తన మొదటి కారు హ్యుందాయ్ అని చెప్పిన పంకజ్ త్రిపాఠి
కార్ల తయారీ దిగ్గజం సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని నియమించింది. తన విలక్షణ నటన, సహజమైన వ్యక్తిత్వంతో పేరుపొందిన పంకజ్ త్రిపాఠి... హ్యుందాయ్ సంస్థ ప్రాధాన్యతనిచ్చే విశ్వసనీయత, వాస్తవికత, భారతదేశంలోని విభిన్న వర్గాల ప్రేక్షకులతో లోతైన అనుబంధం వంటి విలువలకు సరిగ్గా సరిపోతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న తమ విభిన్న వినియోగదారులతో మరింత బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో హ్యుందాయ్ ఒక సరికొత్త పంథాను అనుసరిస్తోందని పేర్కొంది.
పంకజ్ త్రిపాఠిని హెచ్‌ఎంఐఎల్ కుటుంబంలోకి చేర్చుకోవడం ద్వారా భారతీయ ప్రజలతో సంస్థకున్న భావోద్వేగ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే తమ దార్శనికతకు అనుగుణంగా ఉందని, అదే సమయంలో కొంత స్టార్ పవర్‌ను కూడా జోడించినట్లయిందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ తాజా ఒప్పందంతో, ఇప్పటికే ప్రఖ్యాత వ్యక్తులతో కూడిన తమ అంబాసిడర్‌ల బృందాన్ని హెచ్‌ఎంఐఎల్ మరింత బలోపేతం చేసుకుంది.
నటుడు పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ, "విశ్వసనీయత, నూతన ఆవిష్కరణలు, వినియోగదారులకే ప్రథమ ప్రాధాన్యత అనే విలువలతో సుదీర్ఘకాలంగా నిలబడిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌తో భాగస్వామ్యం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా మొదటి కారు హ్యుందాయ్ కావడం, సంవత్సరాలు గడిచేకొద్దీ ఆ బంధం మరింత వ్యక్తిగతమైనదిగా మారింది. నిరాడంబరత, నిజాయతీ, మన మూలాలకు కట్టుబడి ఉండటం వంటివాటికి నేను అధిక విలువనిస్తాను. ఈ విషయంలో హెచ్‌ఎంఐఎల్ సిద్ధాంతాలతో నాకు సహజమైన సారూప్యత కనిపిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా మనం కేవలం సాంకేతికత ద్వారానే కాకుండా, పంచుకున్న కథనాలు, విలువల ద్వారా కూడా దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమవ్వగలమని నేను ఆశిస్తున్నాను" అని అన్నారు.