GDP Growth Rate: నాలుగేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు... కానీ చైనాతో పోలిస్తే మెరుగు!!

GDP Growth Rate at Four Year Low But Better Than China
షార్ట్స్‌లో చూడండి
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం కొంత మందగించింది. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరమైన 2023-24లో నమోదైన 9.2 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండవచ్చని ఎన్ఎస్ఓ తన రెండో ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ప్రస్తుతం విడుదలైన గణాంకాలు ఆ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి సంక్షోభం తదనంతరం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకున్న తర్వాత, వృద్ధి రేటు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఇక, 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి 2025) విషయానికొస్తే, జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైంది. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 8.4 శాతం వృద్ధితో పోలిస్తే ఇది తక్కువేనని ఎన్ఎస్ఓ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, చైనా ఆర్థిక వ్యవస్థ 2025 మొదటి మూడు నెలల కాలంలో (జనవరి-మార్చి) 5.4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
Go Back to Shorts
GDP Growth Rate
Indian Economy
Economic Growth
China GDP
NSO
National Statistical Office

More Telugu News