'సిక్స‌ర్' వివాదం... థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై ప్రీతి జింటా అస‌హ‌నం!

  • నిన్న జైపూర్‌లో త‌ల‌బ‌డ్డ పీబీకేఎస్‌, డీసీ
  • పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో శ‌శాంక్ సింగ్ భారీ షాట్
  • బౌండ‌రీ లైన్ వ‌ద్ద బంతిని అందుకుని లోప‌లికి విసిరిన క‌రుణ్‌
  • త‌న కాలు రోప్‌ను త‌గిలిందంటూ సిక్స‌ర్ సిగ్న‌ల్
  • సిక్స‌ర్ కాద‌న్న థ‌ర్డ్ అంపైర్
  • ఈ వివాదంపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన ప్రీతి జింటా    
శ‌నివారం జైపూర్‌లో జ‌రిగిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) ఐపీఎల్ మ్యాచ్‌లో థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై పంజాబ్ స‌హ య‌జ‌మాని ప్రీతి జింటా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పంజాబ్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో శ‌శాంక్ సింగ్ భారీ షాట్ ఆడ‌గా బౌండ‌రీ లైన్ వ‌ద్ద క‌రుణ్ నాయ‌ర్ బంతిని అందుకుని లోప‌లికి విసిరాడు. 

త‌న కాలు రోప్‌ను త‌గిలిందంటూ సిక్స‌ర్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా... థ‌ర్డ్ అంపైర్ మాత్రం సిక్స‌ర్ కాద‌న్నాడు. ఈ సిక్స‌ర్ వివాదంపై ప్రీతి జింటా స్పందించారు. "ఎంతో టెక్నాల‌జీ ఉన్న హై ప్రొఫైల్ టోర్న‌మెంట్‌లో త‌ప్పులు జ‌ర‌గ‌డం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, జరగకూడదు. మ్యాచ్ ముగిసిన‌ తర్వాత నేను కరుణ్ నాయ‌ర్‌తో మాట్లాడాను. అతను అది క‌చ్చితంగా సిక్స్‌ అని చెప్పాడు" అని ప్రీతి జింటా అన్నారు.   

ఇక‌, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. పీబీకేఎస్‌ నిర్దేశించిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని డీసీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డీసీ బ్యాట‌ర్ల‌లో సమీర్‌ రిజ్వి(25 బంతుల్లో 58 నాటౌట్‌), కరణ్‌నాయర్ (44), కేఎల్‌ రాహుల్‌(35) రాణించారు. ఈ విజ‌యంతో పంజాబ్‌ కింగ్స్ టాప్‌ ప్లేస్ ఆశ‌ల‌పై ఢిల్లీ నీళ్లు చ‌ల్లింది. ఢిల్లీపై గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళుదామనుకున్న పీబీకేఎస్‌కు డీసీ ఊహించ‌ని షాకిచ్చింది. 


More Telugu News