కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ
- రాష్ట్రానికి రూఫ్‌టాప్ సోలార్ సామర్థ్యం కేటాయించాలని విజ్ఞప్తి
- సమావేశం ఫలప్రదమైందని ఏపీ ముఖ్యమంత్రి ట్వీట్
- ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 10,000 రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు
- 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యమని ప్రకటన
రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ యూనిట్లను పెద్ద ఎత్తున నెలకొల్పడం ద్వారా ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించడంతో పాటు, పర్యావరణ హితమైన ఇంధనాన్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 10 వేల యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన తరగతుల (బీసీ) వినియోగదారులకు సబ్సిడీపై రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందం పాల్గొన్నారు.
