భారత్ పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్
––
భారత్–పాక్ మధ్య యుద్ధంపై చైనా తాజాగా స్పందించింది. ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. సరిహద్దు దేశాలలో శాంతి నెలకొనాలని ఆకాక్షించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజంతో పనిచేస్తామని పేర్కొంది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.