ఈరోజు బెంగళూరుకు వెళ్లనున్న జగన్
- ఈరోజు తాడేపల్లిలోని కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్
- సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనం
ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న అవిశ్వాస తీర్మానాలు, తాజా రాజకీయ పరిణామాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఈ అంశాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత జగన్ సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనం కానున్నారు. రాత్రి 8.00 గంటలకు ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.