ఆసక్తికర ఫొటో పంచుకున్న సమంత... సోషల్ మీడియాలో వైరల్!

  • దర్శకుడు రాజ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన సమంత
  • కొంతకాలంగా రాజ్‌తో సమంత డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్
  • సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ 
మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత నటి సమంత నిర్మాతగా కూడా చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ 'ట్రాలాల మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై సమంత చిత్రాలను నిర్మిస్తున్నారు. అయితే, నాగచైతన్య విడాకుల అనంతరం రెండో వివాహం చేసుకున్నా, సమంత మాత్రం సింగిల్ గానే కొనసాగుతున్నారు.

ఈ క్రమంలో కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో దర్శకుడు రాజ్‌తో సమంత కలిసి నటించారు. ఆ తర్వాత కూడా రాజ్, సమంత సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య సంబంధం ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.

అయితే, తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకున్నారు. దానికి వ్యాఖ్యగా "చాలా పెద్ద దారి దాటి బలంగా తయారయ్యాను.. ఇక కొత్త ప్రయాణం మొదలైంది.." అంటూ చివరిగా 'శుభం' సినిమా విడుదల తేదీని పేర్కొంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇందులో దర్శకుడు రాజ్‌తో సమంత దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, సమంత అతనితో దిగిన ఫోటోలను షేర్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


More Telugu News