ప్రకాశం జిల్లాలో ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు .. ఐదుగురు మృతి

Five Killed in Road Accident in Prakasam
  • కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలో ఘటన
  • కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన వైనం
  • అగి ఉన్న కారును ఢీకొన్న లారీ
ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య (60), బాబు (45), నాగేంద్ర (25) మృతి చెందారు. 

అయితే బోల్తా పడిన ఈ లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంబించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్ (14) మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 

వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.   
Go Back to Shorts
Prakasam District
Road Accident
Lorry Collision
Ongole
Koppolu
Andhra Pradesh
Fatal Crash

More Telugu News