రాజ‌స్థాన్ రాయల్స్ 'పింక్ ప్రామిస్‌'.. ప్ర‌తి సిక్స‌ర్‌కు ఆరు ఇళ్ల‌లో వెలుగులు

  • ఈరోజు జైపూర్ వేదిక‌గా ఆర్ఆర్, ఎంఐ మ్యాచ్‌
  • ఈ మ్యాచ్‌కు ముందు రాజ‌స్థాన్ జ‌ట్టు స‌రికొత్త ఆలోచ‌న‌
  • పేద‌ల ఇళ్ల‌లో వెలుగులు నింపేందుకు బృహ‌త్త‌ర నిర్ణ‌యం
  • త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు కొట్టే ప్ర‌తి సిక్స‌ర్‌కు రాష్ట్రంలోని ఆరు ఇళ్ల‌లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) స‌రికొత్త ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చింది. పేద‌ల ఇళ్ల‌లో వెలుగులు నింపనుంది. ఈరోజు ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)తో సొంత‌మైదానం జైపూర్ లోని స‌వాయి మాన్‌సింగ్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌లో త‌మ జ‌ట్టు ఆట‌గాళ్లు కొట్టే ప్ర‌తి సిక్స‌ర్‌కు ఆ రాష్ట్రంలోని ఆరు ఇళ్ల‌లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు త‌న అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా రాజ‌స్థాన్ జ‌ట్టు ప్ర‌క‌టించింది. 

"ఈరోజు మ్యాచ్ చాలా ప్ర‌త్యేకం... ఇది మా పింక్ ప్రామిస్ గేమ్" అని ఆర్ఆర్ ట్వీట్ చేసింది. దీంతో రాజ‌స్థాన్ ఫ్రాంచైజీ నిర్ణ‌యాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. 

ఇక‌, ఇప్ప‌టివ‌ర‌కు ఈ సీజ‌న్‌లో 10 మ్యాచ్ లు ఆడిన రాజ‌స్థాన్ కేవ‌లం మూడింట మాత్ర‌మే గెలిచింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్ ల‌లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవ‌కాశాలు ఉంటాయి. అందుకే ఇవాళ్టి మ్యాచ్ ఆర్ఆర్‌కు చాలా కీల‌కం. ఇందులో ఓడితే నాకౌట్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. మ‌రోవైపు ముంబ‌యి వ‌రుస విజ‌యాల‌తో జోరు మీద ఉన్న విష‌యం తెలిసిందే.  


More Telugu News