దేవినేని కుమారుడి వివాహం.. హాజ‌రైన తెలంగాణ సీఎం, మంత్రి లోకేశ్‌, ప్ర‌ముఖులు

  
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కుమారుడు నిహార్‌ పెళ్లి వేడుక అంగ‌రంగ‌ వైభ‌వంగా జ‌రిగింది. కంకిపాడులో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్, నారా భువ‌నేశ్వ‌రి, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ‌తో పాటు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. 

ఇక‌, తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత తొలిసారి విజ‌య‌వాడ వెళ్లిన సీఎం రేవంత్‌కు హెలిప్యాడ్ వ‌ద్ద ఏపీ మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్‌, నిమ్మ‌ల రామానాయుడు, బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. మంత్రి లోకేశ్‌, సీఎం రేవంత్ రెడ్డి క‌లిసి వివాహ వేడుక వ‌ద్ద‌కు చేరుకుని నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. 



More Telugu News