తలో చేయి వేసిన బ్యాటర్లు... కేకేఆర్ భారీ స్కోరు

  • ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్
  • ఢిల్లీ క్యాపిటల్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసిన కోల్ కతా
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ రాణించడంతో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, కేకేఆర్ మొదట బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. ఆంగ్ క్రిష్ సూర్యవంశి 44, రింకూ సింగ్ 36, సునీల్ నరైన్ 27, రహ్మనుల్లా గుర్బాజ్ 26, కెప్టెన్ అజింక్యా రహానే 26, ఆండ్రీ రస్సెల్ 17 పరుగులు చేశారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కెప్టెన్ అక్షర్ పటేల్ 2, విప్రాజ్ నిగమ్ 2, దుష్మంత చమీర 1 వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో స్టార్క్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడం విశేషం. చివరి ఓవర్లలో కేకేఆర్ స్కోరు మందగించింది.


More Telugu News