ముంబయి ఇండియన్స్ ఖాతాలో మరో రికార్డు
- ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు 150వ గెలుపు
- టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి టీమ్‌గా ముంబయి రికార్డు
- 140 విజయాలతో రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల విషయానికి వస్తే... ముంబయి ఇండియన్స్ 150 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, 140 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో, ఆ తర్వాత స్థానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (134), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (129), ఢిల్లీ క్యాపిటల్స్ (112) జట్లు నిలిచాయి.
ఇక, ఈ సీజన్‌ను పేలవమైన ప్రదర్శనతో ప్రారంభించిన ఎంఐ.. ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క గెలుపుతో అభిమానులను నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు... ఇప్పుడు వరుసగా ఐదో గెలుపు తన ఖాతాలో వేసుకుంది.