మెగా డీఎస్సీపై సీఎం, డిప్యూటీ సీఎంల‌కు హ‌రిరామ జోగ‌య్య లేఖ‌

  • డీఎస్సీపై ఓ కీల‌క అంశాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చి కాపు నేత‌
  • కాపుల‌కు డీఎస్సీ నియామ‌కాల్లో ఈడ‌బ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలని లేఖ‌
  • ఆ విష‌యంలో ఇప్ప‌టికే సుప్రీంకోర్టు కూడా అనుమ‌తిచ్చింద‌న్న హ‌రిరామ జోగ‌య్య
ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌లైన వేళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. రాజ‌కీయ కురువృద్ధుడు, కాపు నేత హ‌రిరామ జోగయ్య ఈరోజు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా మెగా డీఎస్సీపై ఓ కీల‌క అంశాన్ని ఆయ‌న కూట‌మి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

డీఎస్సీ నియామ‌కాల్లో 103 రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్రకారం షెడ్యూల్‌-14 చ‌ట్టం ద్వారా విద్య‌, ఉద్యోగాల్లో అగ్ర‌వ‌ర్ణాల్లోని పేదలకు ఈడ‌బ్ల్యూఎస్ కోటాకింద కేటాయించిన 10 శాతంలో కాపు కుల‌స్తుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరారు. ఆ విష‌యంలో ఇప్ప‌టికే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కూడా అనుమ‌తి ఇచ్చిన విషయాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. 

ఈ నేప‌థ్యంలో కాపుల‌కు డీఎస్సీ నియామ‌కాల్లో ఈడ‌బ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి కాపు సామాజికవ‌ర్గ అభ్యున్న‌తికి పాటుప‌డాల‌ని హ‌రిరామ జోగయ్య ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రుల‌ను కోరారు.    




More Telugu News