సమ్మర్లో గజగజలాడించే హారర్ థ్రిల్లర్.. మరో ఓటీటీలో!

  • తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమా 
  • భారీ లాభాలను తెచ్చిపెట్టిన కంటెంట్ 
  • భయపెట్టిన లైటింగ్ - నేపథ్య సంగీతం 
  • అమెజాన్ ప్రైమ్ లోను అందుబాటులోకి

హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే భయపడుతూ చూడటంలోనే అసలైన థ్రిల్ ఉందని వాళ్లు భావిస్తూ ఉంటారు. అందువల్లనే గుంపుగా చూసేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. గతంలో 'ఆహా'లో ఉన్న ఈ సినిమా, ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్'లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పేరే 'మసూద'. 

సాధారణంగా హాలీవుడ్ హారర్ సినిమాలు మాత్రమే ఎక్కువగా భయపెడతాయనే ఒక టాక్ ఉంది. అందుకు కారణం అక్కడి టెక్నాలజీ. అందువలన తెలుగు సినిమాలు పెద్దగా భయపెట్టలేవనే ఒక భావనలో ఉంటారు. అలా అనుకున్న వాళ్లంతా 'ఔరా' అనుకునేలా చేసిన సినిమానే 'మసూద'. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ విహారి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. 

కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా 13 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సాధారణంగా దెయ్యం సినిమాలలో దెయ్యాన్ని భయంకరంగా చూపిస్తూ సగం భయపెట్టేస్తారు. కానీ ఈ సినిమాలో దెయ్యాన్ని చూపించకుండానే భయపెట్టారు. ఒక టీనేజ్ అమ్మాయిని దెయ్యం ఆవహిస్తుంది. ఆ దెయ్యం ఎవరు? దాని ఉద్దేశం ఏమిటి? అనేది కథ. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 



More Telugu News