నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బ‌ర్త్‌డే విషెస్‌

   
నేడు వజ్రోత్సవ (75వ) పుట్టిన రోజు జరుపుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సీబీఎన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

"నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్ర‌బాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బ‌ర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ ఆస‌క్తిక‌ర వీడియోను కూడా జోడించారు. 




More Telugu News