నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... టీచర్లకు స్పష్టం చేసిన గంగూలీ
- బెంగాల్ లో టీచర్ నియామకాల కుంభకోణం
- ఇటీవల నియామకాలు రద్దు
- గంగూలీని కలిసిన ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు
- తమ నిరసనకు హాజరుకావాలని టీచర్ల విజ్ఞప్తి
- సున్నితంగా నో చెప్పిన గంగూలీ
ఇదిలా ఉండగా, ఉద్యోగాలు కోల్పోయిన కొందరు ఉపాధ్యాయులు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోల్‌కతాలోని ఆయన నివాసంలో కలిశారు. ఏప్రిల్ 21న పశ్చిమ బెంగాల్ సచివాలయం వరకు తాము చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు హాజరు కావాలని వారు గంగూలీని ఆహ్వానించారు. అయితే, గంగూలీ అందుకు సున్నితంగా నిరాకరించారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. ఇది తనకు ఏవిధంగానూ సంబంధం లేని అంశం అని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.