కాకాణిని పట్టించిన వారికి బహుమతి ఇస్తా: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బంపర్ ఆఫర్

  • కాకాణి ఎక్కడున్నాడో తెలియడం లేదన్న సోమిరెడ్డి
  • పిరికిపందలా దాక్కున్నాడని ఎద్దేవా
  • మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఇలా పారిపోతారని అనుకోలేదని వ్యాఖ్య
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, అక్రమ రావాణా కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. నెల రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదు. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

కాకాణి గోవర్ధనన్ ఎక్కడున్నారో తెలియడం లేదని... కాకాణి ఆచూకీ చెప్పిన వారికి బహుమతి ఇస్తానని సోమిరెడ్డి చెప్పారు. వైసీపీ వాళ్లు అయినా సరే ఆయన ఆచూకీ చెపితే వారికి కాకాణి ఇంటి పక్కన ఉన్న కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని అనుకుంటున్నానని చెప్పారు.   

పోలీసుల చొక్కాలు విప్పుతానని కాకాణి అన్నాడని, సవాళ్లు విసిరాడని, తొడలు కొట్టాడని... ఇప్పుడు ఎక్కడున్నాడని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. పిరికిపందలా దాక్కున్నాడని అన్నారు. కాకాణి దర్శనమిస్తే చూడాలని ఉందని... మంత్రులుగా పని చేసిన వాళ్లు పిరికివాళ్ల మాదిరి ఇలా పారిపోతారని అనుకోలేదని దెప్పిపొడిచారు. వల్లభనేని వంశీ కూడా పెద్ద తప్పు చేశాడని... జగన్ కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా వల్లభనేని వంశీ తప్పుగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు.  


More Telugu News