కేఏ పాల్ పిటిషన్... ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కేఏ పాల్ పిటిషన్
- ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదన్న పాల్
- కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
మరోవైపు పక్కా ప్రణాళికతోనే ప్రవీణ్ ను హత్య చేశారని పాల్ తన వాదనలు వినిపించారు. పోలీసులు విడుదల చేసినవి మార్ఫింగ్ ఫొటోలని వాదించారు. మృతి ఘటనపై ఎవరూ మాట్లడవద్దని స్థానిక ఎస్పీ అందరినీ బెదిరించారని చెప్పారు. ప్రవీణ్ కు మద్యం సేవించే అలవాటు లేదని అన్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టును ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ప్రవీణ్ మృతిని రోడ్డు ప్రమాదంగా పోలీసులు ప్రకటించిన తర్వాత... సీబీఐ విచారణ కోసం హైకోర్టును కేఏ పాల్ ఆశ్రయించడం గమనార్హం.