ప‌వ‌న్‌కు అస్వ‌స్థ‌త‌... కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం!

  • ఏపీ స‌చివాల‌యంలో కేబినెట్ భేటీ 
  • ఉదయం 10.30 గంట‌లకు మంత్రివ‌ర్గ స‌మావేశానికి వ‌చ్చిన డిప్యూటీ సీఎం 
  • కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందే ఆయ‌నకు అస్వ‌స్థ‌త‌
  • ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క స‌మావేశం ప్రారంభ‌మ‌య్యేలోపే క్యాంపు ఆఫీస్‌కి వెళ్లిపోయిన ప‌వన్
ప్ర‌స్తుతం ఏపీ స‌చివాల‌యంలో కేబినెట్ భేటీ కొన‌సాగుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ఈ భేటీలో మ‌రోసారి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కుర్చీ ఖాళీగానే క‌నిపించింది. 

ఇవాళ ఉదయం 10.30 గంట‌ల ప్రాంతంలో ప‌వన్ మంత్రివ‌ర్గ స‌మావేశానికి వ‌చ్చారు. అయితే, కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందే ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గుర‌యిన‌ట్లు తెలుస్తోంది. దాంతో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క స‌మావేశం ప్రారంభ‌మ‌య్యేలోపే అక్క‌డి నుంచి క్యాంపు ఆఫీస్‌కి వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం. 

ప్ర‌స్తుతం ఆయ‌న క్యాంపు కార్యాల‌యంలోనే విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలోనూ జ‌న‌సేనాని అనారోగ్యం వ‌ల్ల మంత్రివ‌ర్గ భేటీల‌కు గైర్హాజ‌రైన విష‌యం తెలిసిందే. 


More Telugu News