ఉక్రెయిన్ లోని భారత ఫార్మా గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి!.. వీడియో ఇదిగో!
- టార్గెట్ చేసి మరీ దాడి చేసిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి ఆరోపణ
- భారత్ తో స్నేహం నటిస్తూ భారత వ్యాపార సంస్థలపై బాంబులు వేసిందని ఫైర్
- కీలకమైన మందులు నిల్వ చేసిన గోడౌన్ ను నాశనం చేసిందని ఆవేదన
ఈ దాడికి సంబంధించి ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయం కూడా ఓ ట్వీట్ చేసింది. కీవ్ నగరంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ గిడ్డంగిపై రష్యా దాడి చేసిందని, అయితే అది క్షిపణి దాడి మాత్రం కాదని వివరించింది. రష్యా డ్రోన్లు ఫార్మా గోడౌన్ పై దాడి చేశాయని పేర్కొంది. గోడౌన్ లో చిన్నారులకు, వృద్ధులకు అత్యవసరమైన మందులు నిల్వ చేసినట్లు తెలిపింది. కాగా, ఉక్రెయిన్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీలలో ఒకటైన కుసుమ్ ఫార్మా యజమాని భారత్ కు చెందిన రాజీవ్ గుప్తా అని అధికార వర్గాల సమాచారం. గోడౌన్ పై దాడికి సంబంధించి రాజీవ్ గుప్తా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.