అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి పిల్లల్ని కిందకు జారవిడిచిన తల్లి!

  • అహ్మదాబాద్‌లోని ఖోక్రా ప్రాంతంలో ఘటన
  • అగ్ని ప్రమాదంతో ఆరో అంతస్తులో మంటలు, పొగ
  • ఇద్దరు యువకుల సాయంతో బాల్కనీ నుంచి పిల్లలను కిందకు జారవిడిచిన తల్లి
గుజరాత్ లో అహ్మదాబాద్‌లోని ఒక అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం సంభవించింది. తన పిల్లలను కాపాడేందుకు ఒక తల్లి సాహసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలో వైరల్ అయింది. 

నగరంలోని ఖోక్రా ప్రాంతంలో గల ఒక అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం జరగడంతో ఆరో అంతస్తు దట్టమైన పొగతో నిండిపోయింది. మంటలు కూడా చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను కాపాడేందుకు ధైర్యం చేసింది.

ఆరో అంతస్తు బాల్కనీ నుంచి తన పిల్లలను ఇద్దరు యువకుల సాయంతో కిందకు దింపింది. మొదట చిన్న కూతురును, ఆ తర్వాత పెద్ద కూతురును బాల్కనీ నుంచి కింది అంతస్తుకు దింపింది. ఆ తర్వాత తాను కూడా యువకుల సాయంతో కిందకు దిగి ప్రాణాలు కాపాడుకుంది.


More Telugu News