స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు చేసిన ప‌నికి కావ్య పాప‌కు కోపం వ‌చ్చింది... ఇదిగో వీడియో!

  • నిన్న ఉప్ప‌ల్ వేదిక‌గా జీటీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌
  • హైద‌రాబాద్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన గుజ‌రాత్‌  
  • ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్లు వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతుండ‌టంతో య‌జమాని కావ్య మార‌న్ ఆగ్ర‌హం
  • అభిషేక్ శ‌ర్మ ఔట‌యిన తీరుకు తీవ్ర నిరాశ‌
  • ఆ స‌మ‌యంలో ఆమె హావభావాల తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్
నిన్న ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) చేతిలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌ను ఏడు వికెట్ల తేడాతో గుజ‌రాత్‌ ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లుకు కేవ‌లం 152 ప‌రుగులే చేసింది. గుజరాత్ పేసర్, హైద‌రాబాదీ మహమ్మద్ సిరాజ్ (4-17) చెల‌రేగ‌డంతో ఎస్ఆర్‌హెచ్ త‌క్కువ స్కోర్‌కే ప‌రిమిత‌మైంది.  

అయితే, స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఆ ఫ్రాంచైజీ య‌జ‌మాని కావ్య మార‌న్... బ్యాట‌ర్లు చెత్త షాట్లు ఆడి, వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతుండ‌టంతో సీరియ‌స్ అయ్యారు. ఆ స‌మ‌యంలో ఆమె హావభావాల తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

తొలి ఓవ‌ర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. దాంతో పవర్‌ప్లేలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్వేచ్ఛగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఈ ద్వ‌యం రెండో వికెట్‌కు 29 పరుగులు జోడించింది. ఐదవ ఓవర్‌లో సిరాజ్ మ‌రోసారి జీటీకి మ‌రో వికెట్ అందించాడు. ఈసారి అభిషేక్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. 

దాంతో పవర్‌ప్లే ముగిసేస‌రికి హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి 45 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. అంత‌కుముందు యజమాని కావ్య మారన్... అభిషేక్ ఔట‌యిన తీరుతో తీవ్రంగా నిరాశ చెందారు. ఈ స‌మ‌యంలో ఇలాంటి షాట్ అవ‌స‌ర‌మా అనే విధంగా ఆమె ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ఆమె స్పందనను కెమెరాలు బంధించాయి. ఆ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట‌ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.


More Telugu News