హోం గ్రౌండ్‌లో బెంగ‌ళూరు ఘోర ప‌రాజయం... వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు.. వీడియో వైర‌ల్‌!

  • నిన్న చిన్న‌స్వామి స్టేడియంలో పోటీప‌డ్డ‌ గుజ‌రాత్, బెంగ‌ళూరు
  • ఘోర ఓట‌మిని చ‌విచూసిన ఆర్‌సీబీ 
  • తీవ్ర నిరాశ‌కు గురయిన బెంగ‌ళూరు అభిమానులు
  • జ‌ట్టు ప‌రాజ‌యాన్ని తట్టుకోలేక ఏడ్చేసిన బుడ‌త‌డు
బుధ‌వారం హోం గ్రౌండ్ బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఊహించ‌ని విధంగా ఘోర ఓట‌మిని చ‌విచూసింది. గుజ‌రాత్ ఏకంగా 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని మ‌ట్టిక‌రిపించింది. దీంతో బెంగ‌ళూరు అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురయ్యారు. ఈ ప‌రాజయాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ ఓట‌మి నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆ జ‌ట్టుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి కూడా. 

ఇక నిన్న సొంత మైదానంలో బెంగ‌ళూరు ఓట‌మిని చూసి ఫ్యాన్స్ చాలా బాధ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఓ బాలుడు జ‌ట్టు ప‌రాజ‌యం త‌ర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఒక‌టి ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మొద‌ట ఆ బాలుడు త‌న అభిమాన ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఔటైనప్పుడు ఏడుస్తూ క‌నిపించాడు. చివ‌రికి మ్యాచ్ కూడా చేజార‌డంతో బుడ‌త‌డు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌లవుతుండ‌గా... నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. "ఒక్క ఓట‌మికే ఇలా అయిపోతే ఎలా బ్రో... ఆర్‌సీబీ జ‌ట్టుకు, ఫ్యాన్స్‌కు ఇలాంటి ఓట‌ములు స‌హ‌జం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   


More Telugu News