ట్రంప్ ఎఫెక్ట్.. ఏకంగా 1,390 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- ప్రతీకార సుంకాలపై రేపు నిర్ణయాన్ని ప్రకటించనున్న ట్రంప్
- ప్రపంచ వ్యాప్తంగా ఒడిదుడుకులకు గురవుతున్న మార్కెట్లు
- 353 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,390 పాయింట్లు పతనమై 76,024కి పడిపోయింది. నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయి 23,165కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.11%), జొమాటో (0.27%) లాభపడ్డాయి. హెచ్చీఎల్ టెక్నాలజీస్ (-3.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.46%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.35%), బజాజ్ ఫైనాన్స్ (-2.81%), ఇన్ఫోసిస్ (-2.73%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.