Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుండెపోటు ముప్పును 94 శాతం తగ్గించే సరికొత్త మందు

New Drug Leqvio Reduces Heart Attack Risk by 94 percent
Advertisement
  • అమెరికా మందుల కంపెనీలో తయారీ
  • తుది పరిశోధనలు జరుపుతున్నట్లు వెల్లడించిన కంపెనీ
  • గుండెపోటుతో పాటు పక్షవాతం ముప్పునూ తగ్గిస్తుందని వివరణ
Advertisement
జన్యుపరమైన కారణాలతో గుండెపోటుకు గురయ్యే ప్రమాదాన్ని దాదాపు పూర్తిగా నివారించే సరికొత్త ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లెపొడిజిరాన్ అనే ఈ మందును టీకా రూపంలో ఏడాదికి ఒకసారి తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరవని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మందు వినియోగం ఎంతవరకు సురక్షితమనే దానిపై తుది పరీక్షలు జరుగుతున్నాయని, దీనివల్ల పెద్దగా దుష్ప్రభావాలు కూడా లేవని తేలిందని వారు వివరించారు. 

వంశపారంపర్యంగా వచ్చే గుండె జబ్బుల ముప్పు ఈ ఔషధం ద్వారా 94 శాతం తగ్గుతుందని, అదేవిధంగా పక్షవాతం ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ ఈ మందును తయారు చేస్తోంది. త్వరలోనే దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇటీవల షికాగో యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో లెపొడిజిరాన్ ఔషధం పనితీరును శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి.

లెపొడిజిరాన్ ఎలా పనిచేస్తుందంటే..
రక్తంలో లిపోప్రొటీన్ (ఎల్పీ(ఏ)) స్థాయులు పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు తెలిపారు. పాతికేళ్లు కూడా నిండకుండానే గుండెపోటుకు గురయ్యే వారిలో ఈ లిపోప్రొటీన్ పాత్ర కూడా ఉంటుందని వారు వివరించారు. ఈ ప్రొటీన్ ను 1974 లో గుర్తించారు. ఇది వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని, జన్యువులే ఈ ప్రొటీన్ ను నియంత్రిస్తాయని వైద్యులు చెబుతున్నారు. లెపొడిజిరాన్ ఔషధం ఈ ప్రొటీన్ స్థాయులను నియంత్రించడం ద్వారా గుండెపోటు ముప్పును దూరం చేస్తుందని, పక్షవాతం రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. వ్యాక్సీన్ లాగా లెపొడిజిరాన్ ను తీసుకుంటే.. రక్తంలో లిపోప్రొటీన్ ఉత్పత్తిని ఈ మందు కట్టడి చేస్తుందని, తద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చని వారు పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Heart Attack
Stroke
Leptodiran
Eli Lilly
Cardiovascular Disease
Lipoprotein(a)
Genetic Heart Disease
Hereditary Heart Disease
New Drug

More Telugu News