విశాఖలో సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్... టాస్ అప్ డేట్ ఇదిగో!

  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • సన్ రైజర్స్ టీమ్ లో ఒక మార్పు... సిమర్జీత్ స్థానంలో జీషన్ అన్సారీ
  • ఢిల్లీ జట్టులోనూ ఒక మార్పు
  • సమీర్ రిజ్వీ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 
ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు మరేమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. పేసర్ సిమర్జీత్ సింగ్ స్థానంలో జీషన్ అన్సారీ జట్టులోకి వచ్చాడు. అటు, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోనూ ఒక మార్పు చోటుచేసుకుంది. సమీర్ రిజ్వీ స్థానంలో కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్, అతియాశెట్టి  దంపతులకు కొన్నిరోజుల కిందట కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే.


More Telugu News