మయన్మార్ లో 1,600 దాటిన భూకంప మృతుల సంఖ్య

  • నిన్న ఆగ్నేయాసియా దేశాల్లో భారీ భూకంపాలు 
  • మయన్మార్ లో విలయం
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • శిథిలాల కింద నుంచి బయటపడుతున్న మృతదేహాలు 
మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో నిన్న సంభవించిన భూకంపాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా మయన్మార్ లో భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నకొద్దీ శిథిలాల కింద నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయి. మయన్మార్ లో అధికారిక గణాంకాల ప్రకారం భూకంప మృతుల సంఖ్య 1,644కి పెరిగింది. 

నిన్న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 2,500 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మయన్మార్ లో భూకంపం ధాటికి రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. 

అటు, థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భూకంపం ప్రభావంతో 10 మంది మృతి చెందారు. బ్యాంకాక్ లో ఓ బహుళ అంతస్తుల భవనం కూలిపోగా వందమంది కార్మికులు గల్లంతయ్యారు.


More Telugu News