కొడాలి నానిని ఫోన్ లో పరామర్శించిన జగన్

  • గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న కొడాలి నాని
  • గబ్బిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాని
  • ధైర్యంగా ఉండాలని నానికి చెప్పిన జగన్
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఉంటున్న నానికి నిన్న ఛాతిలో నొప్పి రావడంతో గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. మూడు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు గుర్తించారు. నానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు, కొడాలి నానిని వైసీపీ అధినేత జగన్ ఫోన్ లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని నానికి చెప్పారు. నాని ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి డాక్లర్లతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారు.  


More Telugu News