అవయవ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నా: కేటీఆర్
- తెలంగాణ అసెంబ్లీలో అవయవ దానం బిల్లు
- ప్రజాప్రతినిధులు అవయవ దానం చేయాలన్న కేటీఆర్
- సభ్యులు ముందుకొస్తే తొలి సంతకం తానే చేస్తానని వ్యాఖ్య
అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని... నియోజకవర్గాల్లో అవయవదానంపై చైతన్యం తీసుకురావాలని కేటీఆర్ అన్నారు. అవయవదానానికి సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని అన్నారు. తొలి సంతకం తానే చేస్తానని చెప్పారు. అవయవదానం ఎంతో గొప్ప మానవీయ చర్య అని... ఇది మరికొందరికి జీవితాన్ని ప్రసాదిస్తుందని అన్నారు.