తెలంగాణలో రేపటి నుంచి మండిపోనున్న ఎండలు.. జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ

     
రాష్ట్రంలో రేపటి నుంచి ఎండలు మరింత ముదరనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, ములుగు, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, హన్మకొండ, వరంగల్‌, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గరిష్ఠంగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురంలో అత్యధికంగా 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


More Telugu News