డొనాల్ట్ ట్రంప్ కు కానుక పంపిన పుతిన్
- ట్రంప్ ప్రతినిధి మాస్కో పర్యటన సందర్భంగా బహుకరించిన రష్యా ప్రెసిడెంట్
- పెన్సిల్వేనియా కాల్పుల్లో గాయపడ్డ ట్రంప్ క్షేమం కోసం పుతిన్ ప్రార్థించారని క్రెమ్లిన్ వెల్లడి
- ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రయత్నం
ఈ క్రమంలోనే ట్రంప్ కు పుతిన్ ఓ కానుక పంపించారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇటీవల ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలో విట్‌కాఫ్ కు ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ అందించారు. ఆ కానుకను ప్రెసిడెంట్ ట్రంప్ కు అందజేయాలని కోరినట్లు దిమిత్రి పెస్కోవ్ వివరించారు. గతవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విట్‌కాఫ్ కూడా ఈ కానుక విషయం వెల్లడించారు. అది ఒక అందమైన కానుక అని చెప్పారు. ఇదిలా ఉండగా, 2018లో ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్ ఒక సాకర్ బంతిని కానుకగా పంపించారు.