అబుదాబిలోని స్వామి నారాయ‌ణ్ మందిర్‌ను సంద‌ర్శించిన బ‌న్నీ.. ఇదిగో వీడియో
Add ap7am to your home Screen

అబుదాబిలోని స్వామి నారాయ‌ణ్ మందిర్‌ను సంద‌ర్శించిన బ‌న్నీ.. ఇదిగో వీడియో

Allu Arjun Visits Swami Narayan Temple in Abu Dhabi
  
'పుష్ప‌-2: ది రూల్' సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌... ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి ప్రాజెక్టు ప‌నుల్లో బిజీగా ఉన్నారు. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో బ‌న్నీ త‌న త‌ర్వాతి మూవీ చేయ‌నున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం క‌థ చ‌ర్చ‌ల కోసం ఆయ‌న దుబాయ్ వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయ‌ణ్ మందిర్‌ను సంద‌ర్శించారు. 

ఆల‌య నిర్మాణాల‌ను ఆస‌క్తిగా తిలకించిన ఆయ‌న‌... నారాయ‌ణ స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆల‌య ప్ర‌తినిధులు బ‌న్నీకి మందిర్ విశిష్ట‌త‌ను, ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు. కాగా, అట్లీ-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లోని మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 
Advertisement
Allu Arjun
Bunny
Swami Narayan Temple
Abu Dhabi
Atli
Pushpa 2
Telugu Cinema
Indian Cinema
Dubai

More Telugu News