కరీంనగర్ కు బయల్దేరిన కేటీఆర్
- కరీంనగర్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశం
- హాజరవుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తలు
- కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు
ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ముఖ్య కార్యకర్తలు తరలిరానున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వీ కన్వెషన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 5 వేల మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. కరీంనగర్ రాంనగర్ చౌరస్తా నుంచి ప్రారంభమై తెలంగాణ చౌక్, కమాన్ మీదుగా సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.