విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ
- ఆ అవసరమే తమకు లేదన్న మంత్రి సీతక్క
- వ్యక్తిగత కారణాలవల్లే ఆత్మహత్యాయత్నం చేశాడని వివరణ
- అసెంబ్లీలో మంత్రి సీతక్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
నీలోఫర్ లో చేర్పించి విద్యార్థికి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క హితవు పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు కేసీఆర్ పాలనలో హాస్టళ్ల నిర్వహణ బాగుండేదనే మాటే నిజమైతే.. కేసీఆర్ పదేళ్ల పాలనలో మొత్తం 114 మంది గురుకుల విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలని మంత్రి సీతక్క నిలదీశారు. దుబ్బాక హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నివేదిక తెప్పించుకుని సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.