గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం వచ్చినట్టు కాదు: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- గ్రీన్ కార్డు వచ్చినంత మాత్రాన ఎల్లకాలం అమెరికాలో ఉండే హక్కు ఉండదన్న వాన్స్
- ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్య
- తమలో ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయిస్తారన్న వాన్స్
అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డు పొందిన వ్యక్తి నుంచి కొన్ని సందర్భాల్లో దాన్ని తిరిగి తీసుకోవచ్చు. సుదీర్ఘకాలం అమెరికాలో లేకపోయినా, నేరాలకు పాల్పడినా, వలస నిబంధనలు పాటించడంలో విఫలమైనా గ్రీన్ కార్డును వెనక్కి తీసుకునే అవకాశం ఉంది.