ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ర్యాపిడో ఎంట్రీ !
- రెస్టారెంట్ల నిర్వాహకులతో ర్యాపిడో ప్రతినిధుల భేటీ
- స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు ప్రయత్నాలు
- 2015 లో ప్రారంభమైన ర్యాపిడో క్యాబ్ సేవలు
- బైక్ బుకింగ్ సేవలతో మార్కెట్లో పాగా
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో అమలుచేస్తున్న కమీషన్ విధానాన్ని సవాలు చేసే లక్ష్యంతో వ్యాపార ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. కాగా, క్యాబ్ బుకింగ్ సేవలతో 2015 లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ర్యాపిడో... బైక్ బుకింగ్ సేవలనూ అందిస్తూ మార్కెట్లో నిలదొక్కుకుంది. ఈ విభాగంలో ప్రస్తుతం ర్యాపిడో టాప్ 3లో ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని వంద నగరాల్లో ర్యాపిడో సేవలందిస్తోంది.