సికింద్రాబాద్ నుంచి కాదు.. ఈ నాలుగు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి..!
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 720 కోట్లతో అభివృద్ధి పనులు
- పనులకు ఆటంకం కలగకుండా తాత్కాలికంగా కొన్ని రైళ్లలో మార్పులు
- కృష్ణా, జన్మభూమి, హదాప్పర్, కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైళ్ల స్టేషన్ మార్పు
తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు (17405) ఈ నెల 26 నుంచి చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి 9.14కు బొల్లారం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17406) ఉదయం 4.29 గంటలకు బొల్లారం, 5.45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
కాకినాడ-లింగపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07446) ఏప్రిల్ 2 నుంచి జులై 1 వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07445) సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి 7.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
కాజీపేట నుంచి నడిచే హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ (17014) రైలు రాత్రి 8.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17013) తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఏప్రిల్ 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అలాగే, లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి కేంద్రంగా నడుస్తుంది. ఉదయం 7.15 గంటలకు రైలు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుకుటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.