ఎస్ఎల్‌బీసీ ప్రమాదం.. కార్మికుల ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు

Kerala dogs find human traces in SLBC project
  • గత నెల 22న కుప్పకూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్
  • సహాయక చర్యల్లో భాగంగా కేరళ నుంచి జాగిలాలు తెప్పించిన అధికారులు
  • నేటి సాయంత్రానికి కార్మికులను గుర్తించే అవకాశం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగం కూలడంతో అందులో పేరుకుపోయిన మట్టిని జాగ్రత్తగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలోని డీ-2 పాయింట్‌లో గల్లంతైన వారి ఆనవాళ్లను జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.

ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22న ఉదయం పనులు జరుగుతుండగా టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ యంత్రానికి ఇటువైపున ఉన్న 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా, అటువైపున చిక్కుకుపోయిన 8 మంది జాడ గల్లంతైంది. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తుండటంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. 
Go Back to Shorts
SLBC Tunnel
Kerala Dogs
Human Traces

More Telugu News