రేవంత్ రెడ్డికి మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ

Manda Krishna Madiga letter to Revanth Reddy
  • ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలని విజ్ఞప్తి
  • అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని చెప్పారని గుర్తు చేసిన మంద కృష్ణ
  • గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించవద్దని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని ఆ లేఖలో కోరారు.

ఈ నెల 12వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. అంతలోనే గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదని ఆన్నారు. దీనివలన ఎస్సీలకు మళ్లీ అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Manda Krishna Madiga
MRPS
Telangana
Revanth Reddy

More Telugu News