Tiger: పొలం గట్టుపై పెద్దపులి సంచారం... వీడియో ఇదిగో!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొత్తపల్లిగోరి మండల కేంద్రం శివార్లలోని పంట పొలాల్లో పెద్దపులి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. పొలం గట్టుపై ఠీవీగా నడుచుకుంటూ వెళుతున్న వ్యాఘ్రాన్ని చూసి వణికిపోయారు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఓ రైతు తన మొబైల్ ఫోన్ లో పెద్దపులిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

పొలం పనుల్లో మునిగి ఉన్న ఓ మహిళా రైతు పెద్దపులిని చూసి భయాందోళనకు గురయ్యారు. కాగా, పులి సంచారంపై కొత్తపల్లిగోరి గ్రామస్థులు సమాచారం అందించారని, ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తామని అటవీశాఖ అధికారులు మీడియాకు తెలిపారు.

Tiger
Viral Videos
Bhupalapally District

More Telugu News