రెండో సెమీస్‌లో రచిన్ రవీంద్ర సెంచరీ.. భారీ స్కోర్ దిశగా కివీస్!
- లాహోర్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో సెమీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
- సెంచరీ (108)తో కదంతొక్కిన రచిన్ రవీంద్ర
- విలియమ్సన్‌తో కలిసి 164 పరుగుల భారీ భాగస్వామ్యం
ఇక ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కు తొలి వికెట్ కు 48 పరుగుల శుభారంభం లభించింది. 21 పరుగులు చేసి ఓపెనర్ విల్ యంగ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్రతో జతకట్టిన కేన్ విలియమ్సన్ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడాడు. ఈ ద్వయం రెండో వికెట్‌కు ఏకంగా 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ (82 నాటౌట్), మిచెల్ (10 నాటౌట్) ఉండగా... కివీస్ స్కోరు: 224/2 (36 ఓవర్లు). ఇంకా 14 ఓవర్ల ఆట మిగిలి ఉన్నందున భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది.