Advertisement

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్

YS Jagan Criticizes Deputy CM Pawan Kalyan
  • తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో బుధవారం మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్‌
  • ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనానిపై ఘాటు వ్యాఖ్య‌లు
  • ప‌వ‌న్ త‌న జీవితంలో ఒక్క‌సారి ఎమ్మెల్యేగా గెలిచారంటూ ఎద్దేవా
ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా రాద‌ని, ఆయ‌న‌కు వ‌చ్చిన సీట్ల‌కు జ‌ర్మ‌నీలోనే ప్ర‌తిప‌క్ష హోదా వ‌స్తుంద‌న్న ప‌వ‌న్ కామెంట్స్‌ను మీడియా ప్ర‌తినిధులు ప్ర‌స్తావించారు. 

దీనిపై స్పందించిన జ‌గ‌న్‌... "ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు తక్కువ. ఆయ‌న జీవితంలో ఒక్క‌సారి ఎమ్మెల్యేగా గెలిచారు" అంటూ ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చామ‌ని జ‌గ‌న్ తెలిపారు. 

త‌మ పార్టీ నేత‌లు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దాం అన్నారని, అయితే  అందుకు తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చానని ఆయ‌న తెలిపారు. ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు. 
Advertisement
YS Jagan
Pawan Kalyan
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News