నిరసనలు చేస్తే కుదరదు.. నిధులు నిలిపేస్తా: విద్యాసంస్థలకు ట్రంప్ వార్నింగ్
- చట్ట విరుద్ధంగా నిరసనలు తెలిపే విద్యాసంస్థలకు హెచ్చరిక
- కేంద్రం నిధులు నిలిపివేస్తానని వార్నింగ్
- ఆందోళనకారులకు బహిష్కరణ లేదా అరెస్టు వంటి చర్యలు ఉంటాయని హెచ్చరిక
అంతేకాకుండా ఆందోళనకారులకు జైలు శిక్ష లేదా బహిష్కరణ తప్పదని పేర్కొన్నారు. అమెరికా విద్యార్థులైతే తీవ్రతను బట్టి శాశ్వత బహిష్కరణ లేదా అరెస్టు వంటి చర్యలు ఉంటాయన్నారు. ఈ విషయంలో ఎటువంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు అంటూ తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.