ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు విశాఖ స్టేడియం సిద్ధం... కార్పొరేట్ బాక్సులతో కొత్త హంగులు

  • వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మార్చి 24, 25 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు
  • ఈరోజు స్టేడియాన్ని ప‌రిశీలించిన‌ ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ 
  • ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు సంబంధించి ఏర్పాట్లపై కేశినేని సంతృప్తి
విశాఖపట్నంలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం (ఏసీఏ-వీడీసీఏ)లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను ఈరోజు విజ‌య‌వాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు కేశినేని శివ‌నాథ్ (కేశినేని చిన్ని) ప‌రిశీలించారు. మార్చి 24, 30 తేదీల్లో ఈ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు సంబంధించి ఏర్పాట్లను ఆయ‌న ద‌గ్గ‌రుండి చూశారు. 

గ్యాల‌రీలో కొత్త‌గా ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ బాక్సుల‌ను చూసి సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఐపీఎల్ జ‌ర‌గ‌బోయే స‌మ‌యానికి మైదానం స‌రికొత్త హంగుల‌తో కార్పొరేట్ స్టైల్లో అభిమానుల‌కు క‌నువిందు చేస్తుంద‌ని స్టేడియం సిబ్బంది ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ వెంక‌ట‌రామ ప్ర‌శాంత్‌, కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్, కౌన్సిల‌ర్ దంతు గౌరు విష్ణుతేజ్ ల‌తో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.  


More Telugu News