ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన

  • మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ
  • పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో సభ
  • ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జనసేన హైకమాండ్
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన వర్గాలు ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 

తాజాగా, జనసేన ఆవిర్భావ సభ సమన్వయ కమిటీని ప్రకటించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ఈ కమిటీ పనిచేయనుంది. ఈ సమన్వయ కమిటీ... క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ, లాజిస్టిక్స్ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

జనసేన ఆవిర్భాభ సభ సమన్వయ కమిటీ సభ్యులు వీరే...
  • కందుల దుర్గేశ్
  • బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ఏవీ రత్నం
  • కొత్తపల్లి సుబ్బారాయుడు
  • పి.హరిప్రసాద్
  • పడాల అరుణ
  • తమ్మినేని వెంకటేశ్వర్లు
  • పాలవలస యశస్వి
  • లింగోలు సత్యనారాయణ
  • యిర్రింకి సూర్యారావు


More Telugu News